ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా కాంగ్రెస్ పోరాటం.
ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేయడానికి బిజెపి కుట్రలు.
దేశంలో రైతు వ్యతిరేక విధానాలతో ప్రజా కంటకంగా బిజెపి పాలన.
తెలంగాణలో కమిషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్వహణ.
భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ ఫైర్.
దేశంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్యుల ప్రజల నడ్డి వీరుస్తున్నారని, రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కంటకంగా మారాయని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పటాన్చెరువు నియోజకవర్గం బిహెచ్ఇఎల్ మెయిన్ గేట్ వద్ద రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర పటాన్ చెరువు నియోజకవర్గంలో ప్రారంభించారు. పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి అడుగడుగునా ప్రజలందరూ పార్టీలకు అతీతంగా బ్రహ్మరథం పట్టారు. నగరంలోని మియాపూర్, శేర్లింగంపల్లి, బీరంగూడ, రామచంద్రపురం ల మీదుగా యాత్ర పటాన్చెరుకు చేరుకుంది. పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు ముత్తంగి వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ద్వేషము, హింస చిల్లరేగుతున్నాయని దానికి వ్యతిరేకంగానే భారత్ జూడో యాత్రను ప్రారంభించామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా బిజెపి ఆర్ఎస్ఎస్ లు సంయుక్తంగా ప్రజల్లో భయాందోళన రేకెత్తించి దేశాన్ని వారికి మద్దతు ఇచ్చే బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక్కడ ఉన్న బీడీఎల్ పరిశ్రమల్లో అగ్ని, ఆకాష్, మిసైల్ ఉత్పత్తులు చేస్తూ వేసిన రక్షణ రంగంలో కీలక భూమిక వహిస్తున్నాయని అన్నారు. పటాన్చెరులోని బిహెచ్ఇఎల్ పరిశ్రమ ఇంతటి కీలకమైనదో మనందరికీ తెలుసు నని అన్నారు. బిహెచ్ఇయల్, బీడీఎల్ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు భయపెట్టేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు పండుతుందని, ప్రైవేటు పరం చేసేందుకు, ఎల్ఐసి, ఎయిర్పోర్ట్లు ఆస్తులపై పెద్ద ఎత్తున కేంద్ర బిజెపి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టి అడ్డుపడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరిగిపోయిందని ఉన్నత చదువులు చదువుకున్న సరైన ఉద్యోగాలు లేక యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలన్నింటికీ బిజెపి కేంద్ర ప్రభుత్వం విధానాలే మూలమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను చిన్నపిన్నం చేశారని ఆరోపించారు. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న చిన్న దుకాణాలు నిర్వహించే వ్యాపారులు రోడ్డున పడ్డారని నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు బతుకులు అస్తవ్యస్తమైపోయాయని అన్నారు. జీఎస్టీ పన్నుతో అంతంతమాత్రంగా నడుస్తున్న చిన్న వ్యాపారుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని విమర్శించారు. తప్పుడు జీఎస్టీ పన్నుతో దేశవ్యాప్తంగా లక్షలాది చిన్నతరహా వ్యాపారుల చిన్నతర పరిశ్రమలు మూతపడ్డాయని పరిశ్రమల మూతపడడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వ వ్యతిరేక చర్యలేనని విమర్శించారు. నేను బళ్లారి మీదుగా యాత్ర నిర్వహించినప్పుడు సుమారు నాలుగు లక్షల మంది జీన్స్ ప్యాంట్లు ఉత్పత్తి చేసే చిన్న తరహా వ్యాపారులు జిఎస్టి మూలంగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అనుసరించి కెసిఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పోటాపోటీకి అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ ప్రతిరోజు ధరణి పోర్టల్ లో భూములు ఎవరు కొనుగోలు చేశారని చూసుకొని తన స్వీయ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలను ఎప్పటికప్పుడు మారుస్తూ కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలపై బిజెపి కి టిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందని ప్రతిపక్షాలన్నీ ఒకవైపు బిజెపి టిఆర్ఎస్ లో పార్లమెంట్లో అన్ని బిల్లులపై మద్దతిస్తున్నారని రెండు దొందు దొందేనని ఆరోపించారు. దేశంలో భారత్ జూడో యాత్రను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగిస్తున్నానని దేశంలో యువతకు నిరుద్యోగ సమస్య తీర్చడానికి కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రులు బట్టి విక్రమార్క, గీతారెడ్డి, మల్లు రవి, తదితరులు పాల్గొన్నారు.