ప్రమాదకర మలుపులలో కంప చెట్లను తొలగించి ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలి :ఎస్సై పెదపంగ బాబు

మూలమలుపుల వద్ద కంపచెట్లు ప్రమాదాలకు కారణం కంప చెట్లు

వాటిని తొలగించాల్సిన బాధ్యత సర్పంచులు, పంచాయతీరాజ్ శాఖల దే
తిరుమలగిరి (సాగర్), సెప్టెంబర్ 26 (జనంసాక్షి): రోడ్డుకు ఇరువైపులా ప్రమాదకర మూలమలుపులు ఉన్నచోట కంపచెట్లను తొలగించి రోడ్డుపై గుంతలు పూడ్చి, ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలని తిరుమలగిరి సాగర్ ఎస్సై పెదపంగ బాబు అన్నాడు. సోమవారం ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు మండలంలోని రహదారుల ను ఆయన ఎంపీడీవో ఖాజా అస్గర్ అలీ, పంచాయతీరాజ్ ఏఈ సాయి కుమార్ లతో కలిసి పరిశీలించారు. రహదారుల వెంట కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నదని, ఆయా గ్రామాల పరిధిలో ఉన్న రోడ్ల వెంట, మూలమలుపుల వద్ద కంప చెట్లను తొలగించే బాధ్యత సర్పంచులదేనని తెలిపారు. రోడ్లపై గుంతలు ఉండటం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నివారించుటకు గుంతలు పూడ్చి, చెట్లను తొలగించి, మలుపుల వద్ద ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులకు, కార్యదర్శులకు వారు సూచించారు. ఇటీవల కొంపెల్లి శివారులో మూలమలుపు వద్ద రోడ్డు గుంతలు పడి కంప చెట్లు అధికంగా ఉండటం వలన ఇటీవల ట్రాక్టర్ ప్రమాదం జరిగిందని అన్నారు . ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిటిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, కొంపెల్లి సర్పంచ్ కాంసాని శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి యాసీన్ అలీ తదితరులు ఉన్నారు.