ప్రముఖుల కృష్ణాష్టమి శుభకాంక్షలు
గవర్నర్, సిఎం, విపక్ష నేతల అభినందనలు
హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి): గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ’రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మానవ జీవితంలో ’గీత’ బోధనలు ప్రభావశీలమైనవి. మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నా’ అని రేవంత్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ’శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు!’ అని కేసీఆర్ పోస్ట్ చేశారు. ’ వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్. సమస్త లోక రక్షకుడు యశోదానందనుడు, ధర్మాన్ని స్థాపించి, అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేసిన పవిత్ర జగద్గురువు అవతార మూర్తి జన్మాష్టమి పర్వదినం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. వీరితోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన ప్రముఖులంతా సోషల్ విూడియా వేదికగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.