ప్రముఖ తెలుగు సాహితీవేత్త ప్రొఫెసర్ గజానన్ తామన్ మృతి – ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించిన పుట్ట మధుకర్

ప్రముఖ తెలుగు సాహితీవేత్త ప్రొఫెసర్ గజానన్ తామన్ మృతి – ఆయన భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించిన పుట్ట మధుకర్

జనంసాక్షి, మంథని : బహుభాషా కోవిదుడు తెలుగు, సంస్కృతం, మరాఠీ, బెంగాలీ ఉర్దూ పంజాబీ తో పాటు ఆంగ్లభాషలో నిష్ణాతులు. ఆచార్యులు, పండితులు, కవి రచయిత గజానన్ తామన్ సోమవారం రాత్రి మరణించారు ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ప్రజా ఆశీర్వాదయాత్రలో నిమగ్నుడైన పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ మంగళవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన రచించిన మానస సరోవరం, సాకేత రామాయణం తెలుగు సాహితీ ప్రపంచంలో బహు ప్రశంసలందుకున్నాయి. మంథని వాస్తవ్యుడైన ఆయన మహారాష్ట్రలోని నాందేడ్ లోని పీపుల్ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకునిగా ప్రిన్సిపాల్ గా సేవలందించారు రిటైర్డ్ అయిన వెంటనే కుటుంబంతో సహా స్వగ్రామమైన మంథనిలో నివాసం ఉంటున్నారు. ఆయనకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తో సన్నిహిత్యముండేది. దివంగత మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు క్లాస్మేట్. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంథనిలో నివాసం ఉంటున్న ఆయన ఆకస్మికంగా మరణించడం అందర్నీ కలిసి వేసింది. తెలంగాణ ఉద్యమం పట్ల ఆయన రాసిన కవిత్వాలు పాటలు డాక్టర్ నారాయణరెడ్డి, హనుమానుల భూమయ్య తో పాటు పలువురు కవులు మేధావులు ఎంతో ప్రశంసించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. మంగళవారం ఉదయం ఆయన అంత్యక్రియలు గోదావరి తీరంలో పూర్తి చేశారు.