ప్రయాణం 5 గంటలు… ఆలస్యం 14 గంటల ఎయిర్‌ఇండియా

ప్రయాణం వైనమిది

ముంబయి:జీవితంలో మరోసారి ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కకూడదు… వందకు పైగా ప్రయాణీకులు శనివారం తీసుకున్న నిర్ణయమిది. ఐదున్నర గంటల ప్రయాణానికి 14 గంటలు వేచి వుండాల్సి వస్తే ఎవరైనా అదే నిర్ణయం తీసుకుంటూ రేమో. ముంబయి నుంచి సింగపూర్‌ వెళ్లడానికి వందకు పైగా ప్రయాణీకులు శుక్రవారం అర్థరాత్రి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. పన్నెండుంబావుకు బయల్దేరాలి విమానం. తెల్లారేసరికి సింగపూర్‌ చేరుకుని ఉద్యోగాలకు వెళ్లాల్సినవాళ్లే చాలా మంది ఉన్నారందులో కానీ ఇదిగో అదిగో అంటూ ఎయిర్‌ఇండియా సిబ్బంది ఆ విమానాన్ని బయల్దేరదీ సేసరికి సమయం మధ్యాహ్నం రెండు దాటింది. గమ్యం చేరేసరికి ఆఫీసులు మూసేస్తారు. మర్నాడు అదివారం. మళ్లీ సోమవారం వరకూ ఆఫీసు పని అవదు. పక్కా ప్రణాళికతో పనిచేసుకునేవారికి ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఉద్యోగుల  బాధ అయితే ఒక ప్రయాణీకురాలు యూనివర్సిటీలో సీటు కోసం ఇంటర్వూ మిస్‌ అయింది. మరో ప్రయాణీకురాలు అక్కడి స్నేహితురాలి పెళ్లికి ఇక్కడి నుంచి పెళ్లిదుస్తులు పట్టుకెళ్తోంది. ముహూర్తంలోగా వెళ్లగలనా అన్నది అమె టెన్షన్‌. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో అవసరం. కానీ ప్రయాణీకుల అవేదన అర్థం చేసుకునేవారేరి? సరే విమానం అలస్యానికి బలమైన కారణమేదైనా ఉందా అని తీస్తే తేలిందేమిటంటే విమానాన్ని నడపాల్సిన పైలట్లిద్దరూ గైర్హాజరయ్యారట. అదీ ఎయిర్‌ ఇండియా పరిస్థితి.