ప్రాక్టీస్ మొదలెట్టాడు!
బెంగళూరు: టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో కోహ్లీ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం బెంగళూరు జట్టు నెట్ ప్రాక్టీస్‌లో ఫీల్డింగ్ కోచ్ ట్రెంట్ ఉడ్‌హిల్ పర్యవేక్షణలో విరాట్ పాల్గొన్నాడు. తన పూర్తి కిట్‌తో మైదానంలో అడుగుపెట్టిన కోహ్లీ సహచరులతో కలిసి ఫీల్డింగ్, క్యాచింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు.