ప్రాజెక్టులను అడ్డుకునేలా జగన్‌కుట్ర
– ఒక్కసారికూడా జగన్ పోలవరంను సందర్శించలేదు
– 2019లో జగన్‌కు ప్రతిపక్ష¬దా కూడారాదు
– ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలి
– ఏపీ మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, అక్టోబర్16(జనంసాక్షి) : జగన్ పాదయాత్రలో ఉన్నా ప్రాజెక్టును అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వట్లేదని విమర్శిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం అడిగిన పత్రాలన్నీ పంపుతూనే ఉన్నామన్నారు. ఇప్పటి వరకు లక్షా 47వేల మంది ప్రాజెక్టు చూసి వచ్చారని, అయితే జగన్ జగన్ ఒక్కసారి కూడా ప్రాజెక్టు చూడకపోవడం శోచనీయమని విమర్శించారు. 108 వాహనాలపై జగన్ నాటకాలంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం పదవిపై ఆశతో జగన్ సందుల్లో తిరుగుతున్నారని మంత్రి మండిపడ్డారు. 2019లో జగన్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదని వ్యాఖ్యానించారు. 7ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఇప్పటికే 15 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 16కొత్త ప్రాజెక్టులు కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు ఖర్చు, నిర్మాణం జరిగే తీరును ఆన్‌లైన్‌లో ఉంచుతున్నామన్నారు. ప్రపంచంలో ఎవరైనా లెక్కలు చూసుకోవచ్చని దేవినేని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు దోచుకొని జగన్ జైలుకు వెళ్ళాడని ధ్వజమెత్తారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము పవన్ కళ్యాణ్, జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కవాతులు, ప్రదర్శనలు జాతీయ రహదారిపై చేసుకోండని. బ్యారేజీలపై కాదని మంత్రి దేవినేని ఉమ సూచించారు.