ప్రాధాన్యతా క్రమంలో పార్కుల అభివృద్ధి
అన్ని డివిజన్లలో పార్కుల సంరక్షణకు చర్యలు
శాంతివనం పార్కును సందర్శించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో పార్కులను సంరక్షించడం, వాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్దంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నట్లు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాల్గవ రోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని శాంతివనం పార్క్ ను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ డా.పి. రామకృష్ణారావు కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతివనం పార్క్ లో నిత్యం సుమారు 1500 మంది సందర్శకులు వస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం, ఆధునీకరించడం ద్వారా సుమారు 5000 మంది సందర్శకులు వచ్చే విదంగా ప్రణాళికలు సిద్దం చేసి అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సుమారు 12,000 మొక్కలతో మల్టి లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ (ఎంఎల్ఎపి) చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించామని, అక్కడ అవసరమైన ఔషధ గుణాలతో కూడిన అడవి మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. తద్వారా ఆహ్లాదకరమైన వాతారవణంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించబడుతుందని తెలిపారు. అదేవిదంగా సుమారు 500 నుండి 1000 మంది పిక్నిక్, వనభోజనాలు చేసుకోవడానికి అనువుగా సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా “బీచ్ వాలిబాల్” కోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పిల్లలకు ఆనందాన్నిచ్చే ఆట పరికరాలతో పాటు, నైపుణ్యాన్ని పెంచే యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా “చిల్డ్రన్స్ ప్లే ఏరియా” ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాలు రిపేర్లు ఉండటంతో తక్షణమే వాటిని సరిచేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. భగత్ సింగ్ కాలనీలో ప్రభుత్వ ఆదేశానుసారం వాలీబాల్, కబడ్డీ, కోకో మొదలైన ఆట స్థలాలతో కూడిన “పట్టణ క్రీడా ప్రాంగణాన్ని” ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్, ఏఈ వినీల్, అటవీ అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|