ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ సిబ్బందికి కనీస వేతన చట్టప్రకారం వేతనాలు చెల్లించాలి.

ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ వర్కర్స్ యూనియన్ మండల కన్వీనర్ జిలుకర రవి.
వినాయక, డాక్టర్ సుదర్శన్ హాస్పిటల్ లో ఫుల్ డిమాండ్లతో కూడిన వినతి.
తొర్రూరు 22 జూలై( జనంసాక్షి )
ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ ల్యాబ్స్లలో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ యూనియన్ మండల కన్వీనర్ జిలుకర రవి డిమాండ్ చేశారు. శుక్రవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని వినాయక హాస్పిటల్, డాక్టర్ సుదర్శన్ హాస్పిటల్ లో కనీస వేతన చట్టం ప్రకారం పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను హాస్పిటల్ యాజమాన్యానికి సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా జిలకర రవి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే కాంపౌండర్లు సిస్టర్లు ల్యాబ్ టెక్నీషియల్ ఆయాలు చాలీచాలని వేతనాలతో అర్ధాకలితో బ్రతుకు వెళ్లి తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బంది బాగోగులు యజమాన్యమే చూసుకోవాలని అందుకోసం వారికి కనీస వేతన చట్ట ప్రకారం 18,500 నెలసరి వేతనం అందజేయాలని అన్నారు. అలాగే హాస్పిటల్ లో పనిచేస్తున్న సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు తమ ఆసుపత్రిలోనే కాకుండా కార్పొరేట్ హాస్పటల్ లో కూడా అందించేలా హెల్త్ కార్డులు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ వర్కర్స్ యూనియన్ సంఘం నాయకులు ఎండి నజీర్, సందీప్, నితీష్, స్రవంతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు