ప్లాస్టిక్ నిషేధం పాటించండి
ఒంగోలు,అక్టోబర్29(జనంసాక్షి): అద్దంకి పట్టణంలో ప్లాస్టిక్ రహిత సిటీగా మార్చడానికి తోడ్పడాలని నగర పంచాయతీ కమిషనర్ డివిఎస్ నారాయణ కోరారు. దీంతో కాలుష్యాన్ని దూరం చేయానల్నారు. పలు దుకాణాలలో సోమవారం ఆకస్మిక తనికీలు నిర్వహించారు. పట్టణంలో ప్లాస్టిక్ సంచులను తొలగించాల్సిన అవసరం ఉందని, ఉన్న నిల్వలను వెంటనే తొలగించాలని ఆయన అన్నారు. పట్టణాన్ని ప్సాస్టిక్ రహితంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ప్‌లాస్టిక్ సంచులు వినియోగించ రాదన్నారు. ఎ/-/-లాస్టిక్ సంచులను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.