ఫణీర్‌ మూర్తిని విధుల నుంచి తొలగించిన ఐగేట్‌

న్యూఢిల్లీ,జనంసాక్షి: తమ కంపేనీ అధ్యక్ష, సీఈవో బాధ్యతల నుంచి ఫణీర్‌ మూర్తిని తొలగిస్తున్నట్లు ప్రముఖ ఐటీ సేవల సంస్ధ ఐగేట్‌ మంగళవారం న్యూఢిల్లీలో ఓ ప్రకటనలో వెల్లడించింది. తోటి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై జరిమానా విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో కంపెనీ కార్యవర్గం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా కంపేనీ కాంట్రాక్ట్‌ను మూర్తి అతిక్రమించారని తెలిపింది.
అయితే తమ కంపెనీ తాత్కాలిక అధ్యక్షునిగా గెర్హార్డ్‌ వాట్జీంజర్‌ నియమించినట్లు వెల్లడించింది. ఈ నియామకం నేటీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పింది. అయితే గతంలో ఇన్ఫోసీస్‌లో పనిచేసిన ఫణీర్‌ మూర్తిపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఇన్ఫోసిస్‌ ఫణీర్‌ మూర్తికి ఉద్వాసన పలికింది.