ఫిటినెస్ లేని బస్సు నడిపిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల (జనంసాక్షి) జులై   : చేర్యాల మండలంలోని తాడూరు శివారులో వికాస్ స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అదుపు తప్పి బస్సు పంట పొలాల్లోకి వెళ్లిందని వికాస్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు,ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దొంగ సర్టిఫికెట్లు తీసుకొస్తూ ఫిట్నెస్ అని నడుపుతున్న పరిస్థితి ఉందని ఇంతవరకు కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదని వాపోయారు. చేర్యాలలో ఇంచార్జి ఎంఈఓ ఉన్నాడా లేడా అనే పరిస్థితి ఉన్నదన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు విచ్చడివిడిగా పుస్తకాలు అమ్ముతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని ఇప్పటికైనా ఎంఈఓ స్పందించి అనుమతిని రద్దు చేయాలని లేని యెడల ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు .
 
Attachments area