ఫీజు పెంపునకు నిరసనగా తరగతులు బహిష్కరించిన ఏజి విద్యార్థులు
హైదరాబాద్: అగ్రికల్చర్ విద్యార్థుల ఫీజు పెంపునకు నిరసనగా ఏజి విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. యూనివర్శిటి గేటు ఎదుట ఆందోళనకు దిగారు. కలేజీనుంచి క్యాంటీన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ఫీజులను బేషరుతుగా వెనక్కి తీసుకోకపోతే రేపటినుంచి యూనివర్శిటీ అధికారులను నిర్భందిస్తామని హెచ్చరించారు. రీయింబర్స్‌మెంట్ 40శాతం విద్యార్థులకే వర్తిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ గెస్ట్‌హౌస్ నిర్వహణకు నెలకు లక్ష రూపాయాలు వెచ్చిస్తున్న ప్రభుత్వం విద్యార్థులమీద ఫీజులభారం మోపుతుందన్నారు. యూజీ,పీజీ,పీహెచ్‌డీ ఫీజులు మూడురేట్లు పెంచారని వాటిని తగ్గించని పక్షంలో ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రిన్సిపాల్ రాఘవ కార్యలయం వద్దకు వెళ్లి నినాదాలు చేసినా ఆయన స్పందించకపోవటంతో కళాశాల అకౌంట్స్‌గది తాళం వేశారు.