ఫీజు బకాయిల కోసం ఎబివిపి ఆందోళన
జడ్చర్ల,ఆగస్ట్8(జనం సాక్షి): ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై ఏబీవీపీ నాయకులు, కళాశాల్లోని విద్యార్థులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీనాథ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.