ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆదాయ అభివృద్ధి రుణ కార్యక్రమాలు నిర్వహించండి
పీ ఎం ఎఫ్ ఎం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసం కావలసిన రుణం కోసం ప్రణాళికలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ ఆదాయ అభివృద్ధి రుణ ప్రణాళిక కోసం లబ్ధిదారులు ఏర్పాటు చేయాలనుకుంటున్న ఆహార అనుబంధ పరిశ్రమ గురించి, వాటి ఆదాయ,వ్యయాల గురించి, కావలసిన రుణం గురించి, చెల్లించే కిస్తిలను దృష్టిలో ఉంచుకొని, వ్యూహాలు ఎదగాలనే ఆలోచనతో సీసీ లను గానీ, ఏ పీ ఎం ని కానీ సంప్రదించాల్సిందిగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఈశ్వర్ తెలిపారు. ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టితే తద్వారా పేదరికం తగ్గుతుందనే ఉద్దేశంతో మహిళా సంఘాల సభ్యులు అయి ఉండి, ఎటువంటి బకాయిలు లేకుండా, ఉన్నవారికి లబ్ధిదారుల తరఫున పూర్తి ఉచితంగా బిజినెస్ ప్లాన్ తయారుచేసి లోన్ ప్రాసెస్ కోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని 1,50,000 నుండి 20 లక్షల వరకు బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకోబోయే ప్రాజెక్టుకు సంబంధించి యంత్ర పరికరాలకు 70%, షెడ్డు నిర్మాణానికి 30% నిధులను బ్యాంకు ద్వారా సమకూర్చుకోవచ్చు, దీనిపై 30% ప్రోత్సాహక సబ్సిడీ లబ్ధిదారునికి ఈ ప్రాజెక్టులో భాగంగా అందుతుంది. దీనికి కాను లబ్ధిదారులకు బిజినెస్ ప్లాన్ అప్లోడ్ చేసే సందర్భంగా తప్పనిసరిగా కేవైసీ అయిన సెల్ ఆధార్ ,పాన్ , బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఉద్యోగ ఆధార్ రిపోర్ట్ తో సంప్రదించవలసిందిగా ఏపిఎం ఈశ్వర్ తెలిపారు .