ఫైలేరియా మాత్రల పంపిణీ
గరిడేపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): బోదకాలు నట్టలు నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని కట్టవారిగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మీసాల అపర్ణ ఉప సర్పంచ్ గందె ఉపేందర్ రావులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా డీఈసీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీచేస్తుందని రెండు సంవత్సరాలు నిండిన వారందరూ మాత్రలు వేసుకోవాలని సూచించారు. మురుగు నీటిలో వృద్ధిచెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఫైలేరియా వ్యాప్తి చెందుతుందని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మన్సూర్ అలీ, ఏఎన్ఎం అరుణ, ఆశా వర్కర్ మీసాల అరుణ, అంగన్వాడి ఆయా రాయిరాల అరుణ, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.