ఫోని తుఫాన్ కారణంగా బెంగాల్లో ప్రభావం
ఎన్నికల కార్యక్రమాలను రద్దు చేసుకున్న మమత
కోల్‌కతా,మే3(జనంసాక్షి): ఒడిశాలో ఎంటర్ అయిన ఫొని.. బెంగాల్ దిశగా వెళ్లనున్నది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. ఖరగ్‌పూర్‌లో ఆమె తుఫాన్ పరిస్థితిని అంచనా వేయనున్నారు. శనివారం కూడా ఆమె తీరం సవిూపంలోనే ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు. దీంతో ఈ రెండురోజులు నిర్వహించాల్సిన ఎన్నికల ర్యాలీలను దీదీ రద్దు చేసినట్లు తెలుస్తోంది. రైళ్లు రద్దు కావడంతో కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో వందల సంఖ్యలో జనం అక్కడే ఉండిపోయారు. కోల్‌కతా విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.



