ఫౌల్ట్రి రైతుపై కేసు నమోదు
ఒప్పందం ప్రకారం తమ కంపెనీకి అమ్మాల్సిన బాయిలర్ కోళ్లను పౌల్ట్రీ రైతు బయటి వ్యక్తులకు అక్రమంగా అమ్ముకుంటున్నాడని సుగుణ పౌల్ట్రీ ఫామ్ యాజమాన్యం సోమవారం రోజున స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రైతుపై కేసు నమోదైంది. రాజగోపాల్ పేట ఎస్సై మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి… నంగునూరు గ్రామానికి చెందిన పల్లపు రాజుకు సుగుణ కంపెనీకి మధ్యన ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ జరిగింది.ఈ అగ్రిమెంట్ ప్రకారం సుగుణ కంపెనీ దగ్గర తెచ్చుకున్న కోడి పిల్లలను పెంచిన అనంతరం వాటిని రాజు సుగుణ కంపెనీకి మాత్రమే అమ్మాలి. బయట వ్యక్తులకు అమ్మడానికి వీలులేదు. ఈ ఒప్పందంలో భాగంగా తేదీ 23.05.2022 నాడు 6393 బ్రాయిలర్ కోడి పిల్లలను పెంపకానికి రాజ తెచ్చుకున్నాడు.వీటిని తేదీ 02.07.2022 నాటికి మళ్లీ కంపెనీకి అమ్మాల్సింది. కానీ రైతు అలా అమ్మకుండా దొంగ చాటున బయటి వ్యక్తులకి అమ్ముకున్నాడు. ఇలా అమ్మిన కోళ్ల విలువ రూ. 15,66,246/- ఉంటుందని కంపెనీ భావించి రైతుపై సుగుణ పౌల్ట్రీ యాజమాన్యం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఎస్ఐ మహిపాల్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.