ఫ్యూచర్ సిటీకి అనుగుణంగా సౌకర్యాలు
ముచ్చెర్లకు మెట్రోను విస్తరించే ఆలోచన
హైదరాబాద్,ఆగస్ట్17(జనం సాక్షి):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేయనున్న ముచ్చర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయో అన్న అధ్యయనం అప్పుడే ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ప్యూచర్ సిటీగా ప్రపంచానికి రేవంత్ సర్కారు పరిచయం చేసింది. ఫ్యూచర్ సిటీగా చెబుతున్న ముచ్చర్ల ప్రాంతానికి అన్ని సౌకర్యాలు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మెట్రోను కూడా అక్కడి వరకు విస్తరించాలని ఆలోచిస్తోంది. ఇది ఎంత వరకు సాధ్యం, ఏ మార్గంలో ఇది సాధ్యమనే విషయాలపై అధ్యయనం చేయాలని నిర్ణయానికి అధికారులు వచ్చారు. ్గªట్రో రెండో దశ విస్తరణ పక్రియ వేగంగా సాగుంది. ఈ విస్తరణ ముచ్చర్ల వరకు చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు విస్తరణ ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. శంషాబాద్ వరకు మెట్రో విస్తరించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పుడు ఆది ముచ్చర్ల వరకు పొడిగించాలని ఎª`లాన్ చేస్తున్నారు. ముచ్చర్ల వరకు మెట్రో విస్తరిస్తే జరిగే పరిణామాలు, ఫీజిబులిటీ, అలైన్మెంట్, రూట్, భూసేకరణ ఇలా ప్రతి అంశంపై అధికారులు క్షణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అన్నింటినీ పరిశీలించిన తర్వతా రెండో దశ విస్తరణలో భాగంగా పూర్తి ప్రాజెక్టు రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ముచ్చర్ల వరకు మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించిన్టటైతే ఇప్పటి వరకు అనుకున్న విస్తరణ మరింతగా పెరిగిచే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు 78.5 కిలోవిూటర్ల మేర విస్తరించాలని అనుకున్నారు. కానీ ఇందులో ముచ్చర్ల చేరితే మాత్రం అంచనా వ్యయం, కిలోవిూటర్లు పెరగొచ్చు. పది కోట్ల వరకు ఖర్చు అంచనా పెరగొచ్చని అంటున్నారు. ఎందుకంటే శంషాబాద్ నుంచి ముచ్చర్లకు మెట్లో నడపాలంటే మరో 35 కిలోవిూటర్లు అదనంగా ట్రాక్ వేయాల్సి ఉంటుంది. శంషాబాద్ నుంచే కాకుండా నగరంలోని ఇతర మెట్రో మార్గాల నుంచి కూడా ముచ్చర్లకు వెళ్లేలా ఎª`లాన్ చేస్తున్నారు. ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రభుత్వం భారీగా ఎª`లాన్ చేస్తోంది. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాలను సేకరించింది. దాన్ని వివిధ జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తోంది. ఐటీ హబ్‌లు, స్పోర్ట్స్ మైదానాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పర్యాటకం, వినోదం అన్నింటికీ ఇక్కడ స్థానం ఉండేలా ఎª`లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఈ మధ్య అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి టీం ఈ ముచ్చర్లలో కట్టబోయే సిటీనే ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఏఐ టెక్నాలజీతో నిర్మించబోతున్న నగరంగా చెప్పుకొచ్చారు. అందుకే అన్ని మౌలిక సదుపాయాలు అక్కడ ఉండేలా ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టు సమస్య లేకుండా ఉండేందుకు ఎª`లాన్ చేస్తున్నారు.