ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబయి,జూన్8(జనం సాక్షి): దేశీయ మార్కెట్లు శుక్రవారం ప్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో ఆద్యంతం ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు కాస్త కోలుకున్నప్పటికీ స్వల్ప నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోగా.. నిప్టీ ప్లాట్‌గా ముగిసింది.అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు పెరగడంతో ఈ ఉదయం సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఒక దశలో 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. అయితే చివర్లో ఫార్మా, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు కాస్త కోలుకున్నాయి. ఆరంభ నష్టాలను తగ్గించుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 35,444 వద్ద, నిప్టీ 0.70 పాయింట్ల నష్టంతో 10.768 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, సిఎ/-లా, గెయిల్ షేర్లు లాభపడగా.. హిందాల్కో, పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం షేర్లు నష్టపోయాయి.