బంజారా జాతి ఆదర్శ పురుషుడు సేవాలాల్ మహరాజ్ – మంథని మున్సిపల్ ఛైర్పర్సన్

 

పుట్ట శైలజ జనం సాక్షి , మంథని : బంజారా జాతి శ్రేయస్సు కోరుకుంటూ శ్వాసక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ మూఢనమ్మకాన్ని, సాంఘిక దురాచారాలను తండా తండా తిరిగి చైతన్యపురిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనత సేవాలాల్ మహారాజ్ దని మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. సేవాలాల్ మహారాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంథని మున్సిపల్ కార్యాలయంలో సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలు జరిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పుట్ట శైలజ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ సేవలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జయంతి పండుగను గుర్తించి అధికారికంగా చేపట్టడం గిరిజన జాతికే గర్వకారణం అని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాంజీ తండాలో 1739 ఫిబ్రవరి 15న జన్మించిన ఆయన మహారాష్ట్ర యాత్ మాల్ జిల్లా డిగ్రాస్ తాలూకా రూయీతండలో మరణించారని, పొహ్రాగాడ్లో ని సేవాలల్ మహారాజ్ గారి సమాధిని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ , అతని బృందం మహానయుల యాత్రలో భాగంగా దర్శనం చేసుకున్నారని అన్నారు.