బండి సంజయ్ ని కలిసిన మాల మహానాడు నాయకులు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 27(జనం సాక్షి)
వరంగల్ నగరంలో శనివారం అంకేశ్వర పు రామచందర్రావు గ్రేటర్ వరంగల్ మాల మానాడు అధ్యక్షుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గ వరంగల్ పట్టణంలో కొనసాగుతున్న పాదయాత్ర సందర్భంగా జాతీయ మాల మానవుడు ఉపాధ్యక్షుడు కలిసి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకురావద్దని ఇదివరకు భారత అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదని ఐదుగురు ఉన్నత న్యాయమూర్తులు కొట్టివేసిన వర్గీకరణ అంశాలను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక నాయకుడు ఎన్నికల వచ్చినప్పుడు ప్రతిసారీ ఈ అంశాన్ని లేవనెత్తడం వారికి వెన్నతో పెట్టిన విద్య అట్టి అంశాన్ని భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడం యావత్ మాల జాతికి మరియు షెడ్యూల్ కులాలలో ఉన్న ఉప కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఇప్పుడిప్పుడే దళితులు బిజెపి వైపు ఆకర్షితులవుతున్న సందర్భంగా విభజన అంశాన్ని తీసుకురావడం సమంజసం కాదని మెమోరండం బండి సంజయ్ గారికి జాతీయ మాలమానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు గారు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాల మానాడు రాష్ట్ర కార్యదర్శి బన్న సాంబయ్య అనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు కులమల్ల అనిత 44వ డివిజన్ అధ్యక్షుడు మగ్గిడి దర్గా స్వామి 17వ డివిజన్ అధ్యక్షుడు బండ రాజుగారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కలిసిన వారిలో ఉన్నారు