బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే
మండల కేంద్రంలో అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మహాత్మ జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఎంపీపీ లింగాల నిర్మల పాల్గొని మహాత్మ జ్యోతిరావు-సావిత్రి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఎంపీపీ లింగాల నిర్మల మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించేందుకు,సామాజిక అసమానతలను రూపుమాపూటకు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పోరాడిన మహనీయులు మహాత్మా పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు,అన్ని పార్టీల నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.