బడ్జెట్‌పై న్యాయవాదుల నిరసన

కాకినాడ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం 2019-20 వార్షిక బడ్జెట్లో న్యాయవాదుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ… అఖిల భారత బార్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కౌన్సిల్‌ నిరసనకు మంగళవారం శ్రీకారం చుట్టారు. కాకినాడలో బార్‌ అసోసియేషన్‌ ప్రాంగణం నుండి బాలాజీ చెరువు సెంటర్‌ వరకూ ర్యాలీగా వెళ్లి మానవహారం చేపట్టారు. అనంతరం తిరిగి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీగా వచ్చి.. డిఆర్‌ఒ కి వినతిపత్రాన్ని సమర్పించారు. భారతదేశంలో ఉన్న బార్‌ అసోసియేషన్‌ను, ఇంటర్నెట్‌ టాయిలెట్‌ లైబ్రరీ ఏర్పాటుతో భవనాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో రూ.5 వేల కోట్లను న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రజల సౌకర్యాల నిమిత్తం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్‌ న్యాయవాదులకు ఐదు సంవత్సరాల వరకు కనీసం నెలకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.