*బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ,జెడ్పిటీసి!

లింగంపేట్ 30 సెప్టెంబర్ (జనంసాక్షి)
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అంద జేస్తుందని లింగంపేట్ ఎంపీపీ గరీబున్నీసబేగం, జెడ్పిటిసి ఆలేటి శ్రీలత సంతోష్ రెడ్డి అన్నారు.శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం అందిస్తున్న చీరలను బతుకమ్మ కానుకగ స్వీకరించాలి కాని తిరస్కరించ వద్దన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ది పై మాట్లడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొల్లు లావణ్య,ఎంపిటీసి శమీ మున్నీసబేగం,కో-ఆప్షన్ మెంబర్ బాబుజానీ,ఉపసర్పంచ్ కౌడ రవి,ఎంపిఓ ప్రభాకరచారి,ఏపిఎం చామంతుల శ్రీనివాస్,తెరాస నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.మండలంలోని ప్రతి గ్రామ పంచాయతిలో బతుకమ్మ చీరలను సర్పంచులు పంపిణి చేసారు.