బతుకమ్మ చీరలు, యువతకు క్రీడా సామాగ్రి కిట్ల పంపిణీ

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ, జడ్పిటిసి.

చిన్నంబావి అక్టోబర్ 6 జనం సాక్షి

చిన్నంబావి మండల కేంద్రంలోని కొప్పునూరు, బెక్కెం, పెద్ద మారు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ మరియు యువతకు క్రీడా సామాగ్రి పంపిణీకి ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి వెంకట్రామమ్మ కలిసి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు ప్రతి దసరా పండుగకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలు అందించలేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్ర మహిళా మణులకు పెద్దన్నగా నేనున్నానంటూ భరోసా కల్పించి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను ఎంతో విజయవంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మహిళ లకు తోడబుట్టిన అన్నగా బాసటగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలను చూసుకొని మహిళలు ఎంతో మురిసిపోయారు. మాకు పెద్దన్నగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలంగాణ రాష్ట్ర మహిళలు అంతా ఎంతో రుణపడి ఉంటారని సంతోషం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానీ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ తెలంగాణను అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్న గొప్ప యోధుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని మహిళలు అంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని దేశం లోనే అగ్ర బాగాన నిలుపుతున్నారని అన్నారు. అలాగే దసరా సెలవులలో యువత క్రీడా ప్రాంగణాలలో ఆడుకోవడానికి కీట్లను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. జడ్పిటిసి మాట్లాడుతూ మన ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళల కోసం ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అలాగే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న గొప్ప వ్యక్తి మన కేసీఆర్ అని మనందరం కేసీఆర్ ఎంతో రుణపడి ఉండాలని మాట్లాడారు. కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారని మహిళలు ఎంతో ఆనందబరితంగా, ఉత్సాహ బరితంగా, విజయవంతంగా జరుపుకోవాలని మాట్లాడారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి వెంకట్ రామమ్మ, తో పాటుగా చిన్నంబావి మండల ఎంపీడీవో రవి నారాయణ, ఎమ్మార్వో ఎండి ఇక్బాల్, చిన్నంబావి మండల వైస్ ఎంపీపీ పుష్పలత, సర్పంచులు గోవింద్ శ్రీధర్ రెడ్డి, నంది కౌసల్య, పద్మమ్మ, గ్రామ పంచాయతీ కార్మికులు, మహిళలు, ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.