బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది
ఝరాసంగం సెప్టెంబర్ 28 (జనం సాక్షి)బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది అని కొల్లూరు సర్పంచ్ సావిత్రి బస్వరాజు పాటిల్ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి బస్వరాజు పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ మహిళలను ప్రభుత్వం ద్వారా గౌరవించడమేనని,ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ మహిళల గౌరవం పెరుగుతుందన్నారు.మహిళల సంక్షేమం మరియు భద్రత కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు చింతలగట్టు శివురాజ్, ఎంపిటిసి, పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.