బతుకమ్మ పండుగలో సతీమణితో సభాపతి
రుద్రూర్ (జనంసాక్షి):
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రుద్రూర్ మండల కేంద్రంలోని
బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి సతీమణి పుష్ప అన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి ఆడిపాడారు. స్వయంగా వారి సతీమణి తో కలిసి బతుకమ్మను ఎత్తుకున్నారు.
రుద్రుర్ అంగడి బజార్ మరియు గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో
ఆయన మాట్లాడుతూ పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణం అన్నారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్పపండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. అనంతరం గాంధీ చౌక్ దగ్గర ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో
పాల్గొని దుర్గామాత గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో
బోధన్ అర్ డి ఓ రాజేశ్వర్,ఏసీపి కిరణ్ కుమార్,
తహసిల్దార్ ముజీబ్, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, పి ఏ సీ యస్ చైర్మెన్ బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, ఎంపీటీసీ పత్తి సావిత్రి, మండల అభివృద్ధి అధికారి బాల గంగాధర్, తెరాస మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్,గ్రామ తెరాస అధ్యక్షుడు గంగారాం, తెరాస మండల యువజన విభాగం అధ్యక్షులు కన్నె రవి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.