బద్వేల్ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్
పలు గ్రామాల్లో మెల్లగా వస్తున్న ఓటర్లు
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రతేక బృందాల ఏర్పాటు
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్న ఎస్సీ అన్బురాజన్
పోలింగ్ పక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్
అమరావతి నుంచి పర్యవేక్షిస్తున్నామన్న ఎన్నికల అధికారి విజయానంద్
అమరావతి/కడప,అక్టోబర్30 (జనంసాక్షి) : కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను
అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక మొత్తం 15 మంది బరిలో అభ్యర్థులు ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓట్లరు ఉండగా, ఇందులో పురుషులు 1,06,650 ఉండగా, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరని అధికారులు సూచించారు. పోలింగ్ పక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్ చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడిరచారు. బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. జిల్లాలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దొంగఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు కొత్త వ్యక్తులు వస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను గ్రామస్తులు క్యూలో నుండి లాగి పోలీసులకు అప్పగించారు. ఇకపోతే బద్వేలు ఉప ఎన్నికకు 3 వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. 221 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉపఎన్నికలో నియోజకవర్గంలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలు గడిచినప్పటికీ ఓటర్లు కనిపించని పరిస్థితి నెలకొంది. ఒటర్లు లేక పలు పోలింగ్ కేంద్రాలు బోసిపోయాయి. బద్వేల్ ఉపఎన్నిక బరిలో టీడీపీ లేకపోవడంతోనే పోలింగ్ మందకొడిగా సాగుతోంది. టీడీపీకి పట్టున్న గ్రామాల్లో ఓటర్లు ఓటును వినియోగించుకోని పరిస్థితి ఏర్పడిరది. బద్వేలు ఉపఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. గోపవరం పోలింగ్ బూత్ దగ్గర వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ బూత్ నుంచి ఇతర పార్టీల ఏజెంట్ల పట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు తెగబడ్డారు. బయటకు వెళ్లాలంటూ ఇతర పార్టీల ఏజెంట్లపై వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకువచ్చారు. పోలీసులు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరుపై ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు పరిధిలో బీజేపీ ఏజెంట్లను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ నేత సీఎం రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపఎన్నికల్లో దొంగలు, పోలీసులు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను కాకుండా స్థానిక పోలీసులను రక్షణగా ఉంచుతున్నారన్నారు. పోరుమామిళ్లలో బయటి వ్యక్తులను మోహరించారని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బద్దేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక పక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా విజయానంద్ పరిశీలిస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 10.49 ఓట్లు నమోదు అయినట్లుగా వెల్లడిరచారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే అధికారులు వాటిని మార్చినట్లు తెలిపారు. స్థానికంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ఓటింగ్ పక్రియను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ పేర్కొన్నారు. బద్వేల్ నియోజక వర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. అయితే, కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలను కూర్చోవడం చర్చగా మారింది.. మరోవైపు.. పలు ప్రాంతాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ
ఆరోపిస్తోంది.. మరోవైపు.. ఎస్సై చంద్రశేఖర్‌పై ఎస్పీ అన్భురాజన్‌కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఎస్సై చంద్రశేఖర్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు అధికారులు.. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డి పల్లి గ్రామాల్లో తిరుగుతూ బీజేపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన ఎస్సై చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని తెలిపారు.. ఇక, తిరువెంగళాపురం పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేవన్న ఆయన.. పోరుమామిళ్లలో బయట వ్యక్తులు మొహరించారని ఆరోపించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది.. కానీ, లోపాయికారిగా బీజేపీకి సహకరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, కొన్ని పోలింగ్ బూతుల్లో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.