బల్క్‌ ఎస్సెమ్మెస్‌లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అస్సాం అల్లర్ల నేపధ్యంలో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించిన కేంద్ర ¬ంశాఖ తాజాగా దేశంలో పరిస్థితులను సవిూక్షించి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం గురువారం నుండి తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర ¬ంశాఖ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ¬ంశాఖ ఎస్సెమ్మెస్‌లపై, ఎమ్మెమ్మెస్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎస్సెమ్మెస్‌ల రూపంలో వచ్చే రూమర్లతో అధికమవుతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. రోజుకు ఐదు ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ పంపకూడదని కేంద్రం షరతు విధించింది. తరువాత ఎస్సెమ్మెస్‌ల పరిధిని 20కి పెంచింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో బల్క్‌ ఎస్సెమ్మెస్‌లపై నిషేధాన్ని ఎత్తివేసింది.