బస్తీలలో రెచ్చిపోతున్నగ్రామ సింహాలు వెంటనే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్కు వినతి
అల్వాల్ సర్కిల్ పరిధిలోని కాలనీలలో బస్తీలలో వీధి కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉందని వాటి వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారని. వెంటనే ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కింద ప్రతి వీధిలో కుక్కల ఏరివేత చర్యలు చేపట్టాలని అల్వాల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ ఆదేశాల మేరకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కుక్కల సంతాన నియంత్రణకు ప్రజలు కుక్క కాటుకు బారిన పడకుండా ఉండేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏటా దాదాపు 10 కోట్లు జిహెచ్ఎంసి ఖర్చు చేస్తున్నప్పటికీ నగరంలో పిచ్చి కుక్కల బెడద తప్పడం లేదని తాజాగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని కుక్కలు 20 మందిని కరవడం తో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వెంటనే అధికారులుచర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మ అశోక్ రెడ్డి, సి ఎల్ యాదగిరి, టి ఎస్ సంజీవ్ కుమార్, సూర్య ప్రకాశ్ రెడ్డి, పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.