బస్సు దహనం కేసులో జీవిత ఖైదులకు విముక్తి

 

వెల్లూరు జైలు నుంచి విడుదల

చెన్నై,నవంబర్‌19(జ‌నంసాక్షి): ధర్మపురి బస్సు ఘటనలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం విడుదల చేశారు. 2000 సంవత్సరంలో ఓ అవినీతి కేసులో మాజీ సీఎం జయలలితను దోషిగా తేల్చారు. దీంతో ఆ రాష్ట్రంలో అలజడ జరిగింది. ఫిబ్రవరి 2న తమిళనాడు వ్యవసాయ వర్సిటీకి చెందిన ఓ బస్సుకు ఈ ముగ్గురు నిందితులు నిప్పుపెట్టారు. ఆ ప్రమాదంలో ముగ్గురు అమ్మాయిలు సజీవంగా దహనమయ్యారు. అయితే ఆ కేసులో ముగ్గురికి మొదట ట్రయల్‌ కోర్టు మరణశిక్షను విధించింది. కానీ రివ్వ్యూ పిటిషన్‌ తర్వాత ఆ తీర్పును జీవిత కాల శిక్షగా మార్చారు. ఇప్పుడు అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ ముగ్గుర్ని రిలీజ్‌ చేయాలని గవర్నర్‌ పురోహిత్‌ను కోరింది. గవర్నర్‌ ఆదేశాల మేరకు ముగ్గుర్నీ విడుదల చేశారు. ఆ ముగ్గురూ వెల్లూర్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ నుంచి రిలీజయ్యారు.