బాక్సింగ్ పోటీల విజేతలకు బహుమతులు
విజయవాడ,అక్టోబర్13(జనంసాక్షి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడ హిందూ హై స్కూల్ లో అండర్ 14 అండర్ 17 అంతర జిల్లాల బాల బాలికల బాక్సింగ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎం.సాయితేజస్విని, ఎ.లక్ష్మీ ప్రియా యాదవ్, ఎం.కృష్ణమూర్తి నాయక్ , జె.వెంకట సాయి, పి.పవన్ కళ్యాణ్‌లు వివిధ వెయిట్ కేటగిరి లలో బంగారు పతకాలు సాధించారు. జిల్లాలో వివిధ మండలాలకు సంబంధించిన బాక్సింగ్ క్రీడాకారులు 9 సిల్వర్ మెడల్స్, 8 కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను మంత్రి నక్కా ఆనంద్ బాబు తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ సెక్రటరీ వేణుగోపాలరావు, కోచ్ హనుమంత నాయక్, చావలి శ్రీనివాస్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.