బాధితుల పాలిట వరం లా మారిన సీఎం రిలీఫ్ ఫండ్

జూలై 15 జనంసాక్షి : ఎంతో మంది బాధితులను వైద్య సహాయం అందజేసి, ఆర్ధికంగా ఆదుకోవడంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరం లా మారిందని జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా అన్నారు.  శుక్రవారం మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఇదే గ్రామానికి  చెందిన షేక్ అలికి 28 వేల రూపాయలు, అలాగే మరికంటి సాయిలు కు 50 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యేమదన్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి జడ్పీటీసి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్, అశోక్ నాయకులు కొండల్, దావూద్ గౌరీశంకర్, అశోక్, ఖదీర్, రవి నాయక్ తదితరులు ఉన్నారు.
Attachments area