బాబు ¬దా డ్రామాలు పనిచేయవు

మభ్య పెట్టే ప్రచారంలో బాబుది అందెవేసిన చేయి : వైకాపా
కాకినాడ,మార్చి12(జ‌నంసాక్షి): ప్రత్యేక ¬దా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు నేడు ప్రత్యేక ¬దా భజన చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. ప్రజలను మభ్య పెట్టేలా ప్రచారం చేయడంలో చంద్రబాబును మించినవారు మరొకరు ఉండరని అన్నారు. మొదటి నుంచీ ప్రత్యేక ¬దా కోసం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ పోరాటం చేస్తోందన్నారు. కాకినాడ సభ విజయం అయ్యిందని, ప్రజలు రేపటి ఎన్నికల్లో టిడపికి బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.  నియోజకవర్గంలో గ్రావెల్‌, మట్టి మాఫియా దోచేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో అధికారపార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసమే జగన్‌ మోహన్‌రెడ్డి నవరత్న పథకాలను ప్రకటించారన్నారు. జన్మభూమి కమిటీల ద్వారా సర్పంచ్‌లకు అన్యాయం జరుగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. అర్హులైనవారిని ఓటర్లుగా నమోదు చేయిం చేందుకు ప్రతీ బూత్‌కు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతీ 100 మందిలో ఇద్దరు వైఎస్సార్‌ సీపీ సానుభూతి పరులను గుర్తించాలన్నారు. వారి ద్వారా 100 మంది అవసరాలు బూత్‌ కమిటీకి తెలిసేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇలా ప్రతి బూత్‌ కమిటీ ఒక ప్రణాళిక తయారు చేసి నియోజకవర్గ కన్వీనర్‌తో జిల్లా స్థాయికి అందజేయాలన్నారు. బూత్‌ కమిటీ సభ్యులు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక పథకాలను ప్రభుత్వం కనిపించకుండా చేసిందని ఆరోపించారు. ఎన్నికలు సవిూపిస్తుండడంతో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లతో పాటు గృహనిర్మాణ పథకాలను ప్రారంభిస్తున్నారని.. ఈ విషయం ప్రజలు జాగ్రత్తగా గమనించాలన్నారు. ఇవి కూడా  అర్హులకు అందడం లేదన్నారు. అర్హులను గుర్తించి ఈ పథకాలు అందే విధంగా బూత్‌ కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.  పార్టీ విజయానికి బూత్‌కమిటీ సభ్యులు సైనికులుగా పని చేయాలన్నారు. ప్రజలను పార్టీ వైపు తిప్పే బాధ్యత బూత్‌ కమిటీ సభ్యులు స్వీకరించాలన్నారు.  రాష్ట్రంలోని ఉద్యోగుల భవిష్యత్‌తో చంద్రబాబు సర్కారు జూదం ఆడుతోందని, సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన మద్దతు పలికారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మాట ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్‌ మాట ఇస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని వాటికి కట్టుబడి ఉంటారని తెలిపారు.