బాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే

– రాజారెడ్డి హంతకులకు బాబు ఆశ్రయం ఇచ్చారు!
– తుని రైలు దహనం వెనుక బాబు హస్తం
– వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి
విజయనగరం, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) : ఆధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రేనని వైసీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. విజయనగరంలో సోమవరాం నిర్వహించిన
సమావేశంలో భూమన మాట్లాడారు.  పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ దగ్గరినుంచి అడ్డొచ్చిన ప్రతిఒక్కరినీ చంద్రబాబు అంతం చేశారని ఆరోపించారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్లు అప్పటి ¬ంమంత్రి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ప్రస్తావించిన విషయాన్ని భూమన గుర్తుచేశారు.
రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టే సంస్కృతికి చంద్రబాబే బీజం వేశారని అన్నారు. తన చేతుల నిండా రక్తం పూసుకుని శాంతి ¬మం చేస్తున్న నయవంచకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. తునిలో రైలు దహనం వెనుక చంద్రబాబు పాత్ర ఉందని భూమన ఆరోపించారు. ఆయన అండతో రాష్ట్రంలో రౌడీలు స్వైర విహారం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హంతకులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బాధితులు చంద్రబాబును అడుగడుగునా అడ్డుకుంటున్నారని భూమన అన్నారు. రాష్ట్రంలోని 470 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందని భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కరువును తెనవెంట తెస్తారన్న భయం ప్రజల్లో నెలకొని ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు చంద్రబాబు చేసిందేవిూ లేదన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్‌ఆర్‌ పాలన మళ్లీ రావాలంటే ఒక్కజగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావటం ఖాయమని అన్నారు.