బాబ్లీ కేసు వాదనలు అక్టోబర్‌ 3కు వాయిదా

న్యూఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టు కేసు తుది వాదనలను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 3కువాయిదా వేసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున జస్టిస్‌ పరాశరణ్‌ వాదనలను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం వాదనలు… బాబ్లీ ప్రాజెక్టు నిర్మించినా గేట్లను వాడటం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రాజెక్టు పరిసర గ్రామాల్లో తాగునీటి అవసరాల కోసం బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని పేర్కొంది. తమ రాష్ట్ర పరిధిలోని నీటిని మాత్రమే వాడుకుంటున్నట్లు మహారాష్ట్ర న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ వదానల్లోకి వెళితే.. 63 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుంటున్నట్లు 2005లోనే మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని గుర్తు చేసింది. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి   సామర్ధ్యం 2.75 టీఎంసీలు అని తెలిపింది. బాబ్లీతో పాటు పలు ప్రాజెక్టుల ద్వారా  నీటిని అక్రమంగా వినియోగించుకుంటున్నారని చెప్పింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో మహారాష్ట్రలోని  ముంపు ప్రాంతాల్లో పునరవాస పనులు పూర్తి అయ్యాయని తెలిపింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో సుప్రీం కోర్టు ఉత్తర్వులను మహారాష్ట్ర ఉల్లఘించిందని తెలిపింది.