బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే
కేసు నమోదులో బిజెపికి సంబంధం లేదన్న ఎర్రబెల్లి
హైదరాబాద్,సెప్టెంబర్15(జనంసాక్షి): బాబ్లీ పాపం కాంగ్రెస్‌దే అని, బీజేపీని నిందించడం సరికాదని టీఆర్‌ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ కేసు పెట్టిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టిందని…ఈ కేసుతో కేసీఆర్‌కు సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్-టీడీపీది ఘోరమైన పొత్తు అని, ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కేడర్ టీడీపీకి సహకరించదని తెలిపారు. తెలంగాణలో ముందస్తుకు కారణం కాంగ్రెస్సే అని స్పష్టం చేశారు. కొండా దంపతులను పట్టించుకోవాల్సిన అవసరంలేదని.. 25 ఏళ్లుగా తనను తిడుతూ రాజకీయ లబ్ది పొందుతున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణలో మళ్లీ టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. దీనిని ఎవరు కూడా అడ్డుకోలేరని అన్నారు.