బాలికలు అన్ని రంగాలలో రాణించాలి

మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 11( జనం సాక్షి )
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణ 24వ వార్డు మహిళ సమాఖ్య భవనంలో మంగళ వారం అంగన్వాడీ 4వ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్న పిలల్లకు బొమ్మలు మరియు పండ్లు, గుడ్లు,బలామృతం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రకటించిందని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు(విద్య,పోషణ, బలవంతపు వివాహాలు, చట్ట పరమైన హక్కులు, హింస)మొదలగు వాటి వంటి వివక్షతపై అవగాహన పెంచడం ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని అన్నారు.నేటి కాలంలో మహిళలు అన్ని రంగాలలో (విద్య, ఉద్యోగ,రాజకీయ) తదితర రంగాలలో పురుషులకు సమానంగా పోటీ పడుతున్నారు అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పురుషులకు సమానంగా మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి మహిళలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పిల్లలను చిన్నప్పటి నుండే వారికి ఇష్టమైన రంగాలలో పట్టు సాధించేలా ప్రతి యొక్క తల్లిదండ్రులు కృషి చేయాలని అలాంటప్పుడే వారు గొప్ప గొప్ప స్థానాలలో స్థిరపడుతారని అని అన్నారు.
ఆశాలు,ఎ.ఎన్.ఎం ల సహయంతో ప్రభుత్వ ఆసుపత్రిలలో డెలివరీల సంఖ్య పెరగాలనీ అన్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన గర్భవతులైన మహిళలకు పోషకాలను మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు అందజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శైలజ,ఎ.ఎన్. ఎం. శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
Attachments area