బిజెపిని సొంత పార్టీ వారే నమ్మడం లేదా?
కెసిఆర్‌తో లోపాయకారి అవగాహనపై చర్చ
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): పాలమూరు వేదికగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల సమరశంఖం పూరించి, అధథికరా టిఆర్‌ఎస్‌ను, దాని అధినేత కెసిఆర్‌ను తూర్పారా పట్టినా ఎక్కడో ఒక చోట అనుమానాలు మాత్రం ఉన్నాయి. టిఆర్‌ఎస్‌తో బిజెపికి లోపాయకారి ఒప్పందం ఉందన్న భావనలో స్వయంగా బిజెపి కార్యకర్తలే ఉన్నారు. ఇప్పటికీ దీనినే నమ్ముతున్నారు. గ్రామాల్లో ఎవరిని అడిగినా ఇదే కరెక్ట్ అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ విజయం ఖాయమన్న నమ్మకంతోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు కూడా ఆయనకు సహకరిస్తున్నారన భావన బలపడింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఆస్కారముంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత
కేసీఆర్ ఎక్కువ ఎంపి సీట్లు సాధిస్తే అవి తమకు ఉపయోగంగా ఉంటాయన్నది మోడీ అంచనాగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 70 నుంచి 80 స్థానాల వరకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ప్రజలు ఉన్నారు. ముస్లింల వైఖరి మారితే తప్ప కేసీఆర్‌ను నిలువరించడం మహా కూటమి వల్ల కాదు. గత ఎన్నికలలో బిజెపితో కలసి పోటీ చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది గెలిచినా ఒకరో ఇద్దరో మాత్రమే మిగిలారు. మిగతా వారంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తే ఒకరిద్దరు గెలవవచ్చు. ఆ తర్వాత వారు మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరరన్న గ్యారంటీ లేదు. అందుకే ఎన్నికల తర్వాత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయంగా కనిపిస్తున్నది. బిజెపి ఎంత కాదనుకున్నా కెసిఆర్ సాయం అవసరం తప్పదు. అందుకే బిజెపి ఎంత చెబుతున్నా, ఒంటరిగా పోరాటం చేస్తామని అంటున్నా ప్రజలు నమ్మడం లేదు. లోపాయకారి ఒప్పందం కారణంగానే ముందస్తు ఎన్నికల్లో కెసిఆర్/-కు సహకరాం ఉందని అంటున్నారు. మోడీ అనుమతితోనే కెసిఆర్ ధైర్యంగా ముందస్తు ఎన్నికల సవాల్ విసిరారని భావిస్తున్నారు.