బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి జోరు గా చేరిక.

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.
గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 29 జనం సాక్షి.
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో
గట్టు మండల పరిధిలోని లింగా పురం గ్రామానికి వడ్డెర సంఘం చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశవన్న వెంకటేశు నరసింహులు వీరేషు ఆంజనేయులు తిమ్మప్ప కృష్ణప్ప నాగేషు నరేందర్ మల్లికార్జున్ నీలెప్ప మునిస్వామి నర్సింహులు నాగరాజు వీరితో పాటు మరికొంత మంది ఆ పార్టీలకి గుడ్ బై చెప్పి నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుచుట కు బిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.వీరి పాటు నాగరాజు , రంగస్వామి జగన్ గోపాల్ వీరేష్, ఆటో లింగన్న ,రమేష్, ఎల్లప్ప, రాముడు, పరుశ రాముడు, బలరాముడు, పరమేశు, తోటరాముడు, శేఖరు, రాముడు, లింగన్న, సవారి ,తిమ్మన్న, కేశవన్న, వెంకటేశు, సురేందర్ ,లింగన్న, ఆంజనేయులు, రామాంజనేయులు, నర్సింలుమహులు వీరితో పాటు 100 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, కార్యక్రమాలు ఈ 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్.ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చులు పెట్టడానికి కులాల పేరుతో మతాల పేరుతో రంగురంగుల వేషాలు వేసుకొని మాయమాటలు చెప్పి సోదర భావంతో ఉన్న మన మధ్యల చిచ్చు పెట్టడానికి వస్తారు కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఒక సారి సీఎం కెసిఆర్ ని, నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, కౌన్సిలర్ నాగిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.