బిసిలకు చేయూతపై నేతల హర్షం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): బిసి కులస్తులకు 14 ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జయ¬ బిసి సభలో ప్రకటించడం పట్ల బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు, ఎ1 సేవా సమితి వ్యవస్థాపకుడు చెల్లుబోయిన శ్రీనివాస్‌లు హర్షం వ్యక్తం చేశారు. బిసి కులస్తులకు కార్పొరేషన్లు ఆక్సిజన్‌ లాంటిదని, దీని వల్ల వారు పురోగతి సాధిస్తారన్నారు. రాజమండ్రిలో ఆదివారం జరిగిన జయ¬ బిసి సమావేశంలో చంద్రబాబు ప్రకటనతో రాజోలులో సోమవారం ఉదయం చెల్లుబోయిన శ్రీనివాస్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. బిసిల విదేశీ విద్యకు రూ.15 లక్షలు కేటాయించడం, చేనేతకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్‌, పట్టు కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయలను రూ.2 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడపై హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ సహకరించిన అందరికి జిల్లా బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ కమిటీ, ఎ1 సేవా సమితి తరుపున కఅతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బిసి లో ఉన్న అన్ని తరగతుల వారికి కార్పొరేషన్‌ లు ఏర్పాటు చేసి వారి అభివఅద్ధి కి ప్రభుత్వం మరింత సహకరించాలని చెల్లుబోయిన శ్రీనివాస్‌ కోరారు.