బి టి పి ఎస్ లోని కాంటాక్ట్ కార్మికుల జీవితాలను వెంటనే చెల్లించాలి
పినపాక నియోజకవర్గం ఆగష్టు 23( జనం సాక్షి):భద్రాద్రి పవర్ ప్లాంట్ (బి టి పి ఎస్) లోని కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ,సీపీఐ నాయకుల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
భద్రాద్రి పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టు లేబర్ గా పని చేస్తున్న కార్మికులకు వెంటనే జీతాలు విడుదల చేయాలని అన్నారు.
-మంగళవారం బి టి పి ఎస్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐటిసి సిపిఐ నాయకులను కలిసి తమ గోడు వినిపించుకున్నారు నాలుగైదు నెలల నుండి జీతాలు ఇవ్వక ఇబ్బందుల పడుతున్నారని పెళ్ళాం ,పిల్లల్ని పోషించాలంటే ఇబ్బందిగా మారిందని, వేతనాలు ఇవ్వక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సంబంధిత కాంట్రాక్టు పై అధికారులు దృష్టి సారించి జీతాలు విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని లేకుంటే ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బట్ట సాంబయ్య ,కళ్యాణ్ ,వినోద్ బట్ట పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.