బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అనేది అబద్ధం
తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించింది
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్,ఆగస్ట్16(జనంసాక్షి ): బీజేపీ లో బీఆర్‌ఎస్ విలీనం అనేది శుద్ధ అబద్ధమని.. అలాంటి చర్చ బీజేపీ లో లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ఏమైనా మాట్లాడుకుంటునరేమో.. దాన్ని బట్టి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉండొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మమ అనిపించిందని మండిపడ్డారు. పూర్తి స్థాయి లో రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయలేదు.. ప్రజల్ని రైతుల్ని సీఎం మోసం చేశారని అన్నారు. హైడ్రా పేరుతో అడ్డగోలుగా కూల్చివేతలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అడ్డగోలుగా కూలగొట్టి అధికారం వారికి ఎవరు ఇచ్చారన్నారు. పరిధిలో ఉన్న భూములు ప్రభుత్వ భూములు కాదు.. అవి రైతులవి అన్నారు. అప్పట్లో ఎందుకు నిర్మాణాలకు అనుమతి ఇచ్చారన్నారు. ఇక పై నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. %ూRR% లోపల ప్రాంతాల విలీనం అనేది ఏదో గీతలు గీసినట్టు ఉండకూడదు%ౌ% అన్ని అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ గ్రాఫ్ ఏమీ పడిపోలేదు%ౌ% ఒక్కో సారి ఒక్కోలా ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్ష మార్పు పై నాకు ఎలాంటి సమాచారం లేదు%ౌ% పార్టీ చూసుకుంటుందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల విషయం లో గతం లో కేటీఆర్ మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. వేల కోట్ల పెట్టుబడులు అనేది తప్పన్నారు. లోకల్ వారిని ప్రోత్సహించాలన్నారు.