బీజేపీ పార్టీ లో చేరిన బట్టుపల్లి గ్రామస్తులు జనంసాక్షి, మంథని :

పార్లమెంట్ కన్వినర్ మల్లికార్జున్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో మంథని మండలం బట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గొట్టం లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 50 మంది గ్రామస్తులు బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ప్రధానమంత్రి చేస్తున్న అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై, అవినీతి టిఆర్ఎస్ పాలనపై విరక్తి చెంది , మంథని ప్రాంతంలో మార్పు కొరకు సునీల్ రెడ్డితో కలిసి పనిచేయాలని ఉద్దేశంతో బిజెపి పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి పార్టీకి రోజురోజుకీ జనాల్లో ఆదరణ పెరుగుతుందని , కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు మనుగడ లేదని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు రోజురోజుకి బిజెపి పార్టీలో చేరికలే దానికి నిదర్శనమని 40 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, 10 సంవత్సరాలు పాలిస్తున్న బీఆర్ఎస్ మంథని ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యం, మన ప్రాంతం నుండి నీళ్లు, బొగ్గు, ఇసుక తరలించుకుంటూ పోతూ మనకి ఏ విధమైన అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమ పథకాలు కూడా అధికార పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి అరె ఓదెలు, ఉప అధ్యక్షులు రేపాక శంకర్, పత్తి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొరబోయిన మల్లికార్జున్, అలవేణి సమ్మయ్య, గాడేపు కృష్ణ, లంబు అమరేందర్ రెడ్డి, బూడిద విష్ణు తదితరులు పాల్గొన్నారు.