బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 : బీజేపీ చేర్యాల మండల ప్రధాన కార్యదర్శిగా నరుకుల విజయ్ కుమార్ ని నియమించినట్లు బీజేపీ చేర్యాల మండల అధ్యక్షులు కాశెట్టి పాండు ప్రకటించారు. బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తమ ఎన్నికకు కృషి చేసిన నాయకత్వానికి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి వడ్లకొండ వెంకటేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి షాదుల్లా, దళిత మోర్చా మండల అధ్యక్షుడు సిద్ధులు, బీజేవైయం జిల్లా నాయకులు ఉట్లపల్లి సురేష్, కమలేష్ పాల్గొన్నారు.