బీజేపీ ముసుగులో.. ముగ్గురు ఆంధ్రా ద్రోహులు
– టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ, అక్టోబర్2(జనంసాక్షి) : బీజేపీ ముసుగులో ముగ్గురు ఆంధ్రా ద్రోహులు తయారయ్యారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కన్నా, జీవీఎల్, సోము వీర్రాజు ఆంధ్రా ప్రజల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎల్ సర్వేల పేరుతో మోదీకి దగ్గరై ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు. అవినీతి కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నైజం కన్నాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తులపై కన్నా బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
జీవీఎల్ ఆంధ్రాలో పుట్టి ఢిల్లీలో పైరవీల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. రాష్ట్రంలో ప్రజాదరణ లేని వ్యక్తి సోమూ వీర్రాజు అని, ఏ ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి టీడీపీని విమర్శించడం దారుణమని అన్నారు. ఏపీలో బీజేపీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని బుద్దా వెంకన్న తెలిపారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని హావిూ ఇచ్చిన మోదీ దానిని తిరస్కరిస్తే ప్రశ్నించలేని దద్దమ్మలు బీజేపీ నేతలని అన్నారు. ప్రత్యేక ¬దా, ప్రత్యేక ప్యాకేజీపై ఎప్పుడైనా రాష్ట్ర బీజేపీ నేతలు మోదీని అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టని ఇలాంటి నేతలకు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. కేంద్రం ఎలాంటి సహాయం అందించక పోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న ఘనత చంద్రబాబుది అని, అలాంటి చంద్రబాబును విమర్శించడం సరికాదన్నారు.