బీమాపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. ఖాజిపేట్‌ మండలంలోని మడికొండ గ్రామంలో రైతు బీమా పత్రాలను మేయర్‌ నన్నపనేనినరేదర్‌ తో కలసి ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పంపిణీ చేసారు. సీఎం కేసీఆర్‌ స్వయాన రైతు కాబట్టి రైతుల కష్టాలు తెలుసు కాబట్టి రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడికి ఎకరాకు 4 వేల చొప్పున రెండు పంటలకు 8 వేల రూపాయలను అందిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రైతుకు 2,271 రూపాయలతో బీమా ప్రీమియంను చెల్లిస్తుందన్నారు. రైతు దేశానికి వెన్నుముక అని మేయర్‌ నరేందర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పంట సాగుకు 365 రోజులు సాగునీరు అందిస్తామన్నారు. రైతు ఏకారణం వల్ల మరణిస్తే 10 రోజులల్లో 5 లక్షల రూపాయను ఇంటికి తీసుకవచ్చి ఇస్తామన్నారు.