బీసీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లాలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి లేకపోవడం సిగ్గుచేటు
. గత ఆరేళ్లుగా ఇన్చార్జిలతో నెట్టుక రావడం దారుణం
జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి లేకపోవడం వల్ల అవినీతి, అక్రమాలు
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు గౌడ్
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి లేకపోవడం చాలా దుర్మార్గమని దీనికి మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బీసీ అభివృద్ధి శాఖ అధికారి లేకపోవడం వల్ల ఇంచార్జ్ పాలనే గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుందని బీసీ అభివృద్ధి అధికారిని కూడా ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో మంత్రి ఉండడం సిగ్గుచేటైన చర్యని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఆరు సంవత్సరాలుగా ఇదే తంతు సాగుతున్న గాని మంత్రిలో చలనం లేదని అధికారినే నియమించుకోలేని మంత్రి ఆ శాఖ ఎలా చూస్తున్నాడో అర్థం అవడం లేదన్నారు.
బీసీ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్న వ్యక్తిని అధికారిగా కొనసాగుతున్నడని దీనితోపాటు ఇంకా రెండు శాఖలను తనే చూడడం వల్ల బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు.
దీంతో జిల్లాలోని బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు,బీసీ కార్పొరేషన్ లో యువతకు స్వయం ఉపాధి రుణాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులవృత్తుల కోసంబిసి బంధు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని శాఖా పరంగా పర్యవేక్షించాల్సిన అధికారి ఒక్కడే కావడం వల్ల తలకు మించిన భారం అధికారులకు అవుతుందని స్కాలర్షిప్లులు, సంక్షేమ పథకాలుసరైన సమయానికి అందడం లేదని ఆక్రోషం వ్యక్తం చేశారు.
గత మూడేళ్లుగా బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న మంత్రిగా గంగుల కమలాకర్ బీసీ డెవలప్మెంట్ పై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు.
బీసీ అభివృద్ధి శాఖకు జిల్లా డెవలప్మెంట్ అధికారి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి ఉందని అడ్డు అదుపు లేకుండా ఇష్ట రాజ్యాంగ అవినీతి జరుగుతుందని ఇష్టం వచ్చినవారికి బి ఆర్ ఎస్ కార్యకర్తలకే బిసి లోన్లు ఇస్తున్నారని, బీసీలకు ఇచ్చే లోన్లలో పూర్తిగా పారదర్శకత లోపించిందని లోన్ తీసుకునే లబ్ధిదారుడు ఏ వ్యాపారం కోసం తీసుకుంటున్నాడో కనీసం తనిఖీ చేయాల్సి ఉంటుందని అధికారులు ఇష్టం వచ్చిన వారికి ఆర్థికంగా ఉన్నవారికి లోన్లు ఇస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మంత్రి గంగుల కమలాకర్ కు బీసీ విద్యార్థులు, యువకుల, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే బిసి సంక్షేమ అధికారిని నియమించాలని, బీసీ సంక్షేమ శాఖలో లోన్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని పైడిపల్లి రాజు గౌడ్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.