బుడమేరులో పెరుగుతున్న వరద ఉద్దృతి
జీకోండూరు :కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో జీకోండూరు మండలంలోని బురమేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో బుడమేరుపై గలగలేరు వద్ద నిర్మించిన రెగ్యులెటర్ వద్ద మంగళవారం ఉదయం 6.5అడుగుల నీటి మట్టం చేరింది మరో మూడడుగులు దాటితే షట్టర్లు ఎత్తి నీటిని దిగువకు వదలతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద నీటిని మళ్లింపు కాలువ ద్వారా కృష్ణానదిలోకి తరలిస్లున్నట్లు చెప్పారు.